Saturday, 24 August 2019

Krishnam Vande Jagadgurum!

వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనం 
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్|

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టినభోగి జ్ఞానయోగి // పల్లవి //
అపరిమితములైనయజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి // తానే //
అన్నిచేఁతలను బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరంగఁ గరుణించు
పన్నగశయనుఁడే బ్రహ్మయోగి // తానే //
తనరఁగఁ గపిలుఁడై దత్తాత్రేయుఁడై
ఘనమైనమహిమ శ్రీవేంకటరాయఁడై
వొనరఁగ సంసారయోగము గృపసేయు
అనిమిషగతుల నభ్యాసయోగి // తానే //

అన్నమాచార్యుల సంప్రదాయంలో భగవంతుడు శ్రీనివాసుడు ప్రథమ గురువు. జగన్మాత శ్రీదేవి రెండవ గురువు. 

భగవద్గీతా సారాన్ని అన్నమాచార్యులవారు ఇందులో బోధిస్తున్నారు.

పల్లవి:

తానే తానే యిందరి గురుఁడు
సానఁబట్టినభోగి జ్ఞానయోగి 

సంస్కృతంలో యుజ్ అనే ధాతువుని కలిపి ఉంచడం అనే అర్థంలో వాడతారు.  అందరికీ అంతర్యామిగా అందరితోనూ నిత్యం కలసి ఉండే సర్వేశ్వరుడే అందరికీ గురుడు, అందరికన్నా పెద్ద యోగి!

చరణం 1:

అపరిమితములైనయజ్ఞాలు వడిఁ జేయఁ
బ్రపన్నులకు బుద్ధి పచరించి
తపముగా ఫలపరిత్యాగము సేయించు
కపురుల గరిమల కర్మయోగి 

భోక్తారం యజ్ఞ తపసాం అని భగవద్గీతలో అన్నట్లుగా (5.29) ఆయనే సమస్త యజ్ఞాలకూ తపస్సులకూ భోక్త. "పత్రం పుష్పం ఫలం తోయం" అన్నట్లుగా భక్తులు పత్రం, పుష్పం, ఫలం, జలం ఏది సమర్పించినా ఎంతో ప్రేమగా స్వీకరిస్తాడు (గీత 9.26).  జగత్తునంతటినీ నిరంతరం అనుభవించడంలో నేర్పరి. "వాసుదేవః సర్వమితి"  అన్నట్టుగా వాసుదేవుడే సర్వమని (గీత 7.19) తలచే జ్ఞానులకు నిరంతరము లభించే జ్ఞాన యోగి. 

భోక్తారం యజ్ఞ తపసాం సర్వ లోక మహేశ్వరం 
సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్ఛతి| 

పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి 
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః | 

బహూనాం జన్మనామ్ అంతే జ్ఞానవాన్ మామ్ ప్రపద్యతే 
వాసుదేవః సర్వమితి స మహాత్మా సుదుర్లభః | 

చరణం 2:
అన్నిచేఁతలను బ్రహ్మార్పణవిధిఁ జేయ
మన్నించు బుద్ధులను మరుగఁజెప్పి
వున్నతపదమున కొనరంగఁ గరుణించు
పన్నగశయనుఁడే బ్రహ్మయోగి

యజ్ అనే ధాతువు సంస్కృతంలో దేవపూజ అనే అర్థంలో వాడతారు. 
భగవంతుడే సర్వమని తెలిసిన వాడు ప్రపన్నుడు (7.19). అలాంటి ప్రపన్నులు చేసేది జ్ఞాన యజ్ఞం. ఆ విధంగా జ్ఞానం ద్వారా ప్రపన్నులచే అనేక విధాలుగా అర్చించబడే వాడు స్వామి. ఇక్కడ "జ్ఞానయజ్ఞమీగతి మోక్ష సాధనము" అన్న కీర్తన గమనించతగ్గది. 
తపస్సు అంటే భగవంతుడి పాదాలవద్ద అణిగి ఉండటమే. "మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా" (గీత 3.30) అని చెప్పి సర్వకర్మలయందూ మమకారాన్ని త్యజించి వాటిని తనకే విడిచి పెట్టమని చెప్పిన స్వామి కర్మయోగి!
ఇదే విషయాన్ని రామే సంన్యస్త మనసా, తపస్వినీ, అని వాల్మీకి మహర్షి సీతమ్మ వారి గురించి చెప్పగా దాన్ని నమ్మాళ్వార్లు మరింత విశదంగా మన అందరికీ వర్తించేలాగ చెప్పారు. 

బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: అని గీతలో (4.24) అన్నట్లుగా చేసేదంతా బ్రహ్మమయంగా భావించే వారు ఆ పరబ్రహ్మాన్నే పొందుతారు (బ్రహ్మైవ తేన గంతవ్యం). వారిని తాను ఏలుకుంటాను అని తెలియజెప్పి, చివరకు కరుణతో  తన పదాన్ని అనుగ్రహించే ఆ యోగనిద్రలో ఉన్న పన్నగశాయి "బ్రహ్మయోగి"! ఇక్కడ యోగనిద్ర జగద్రక్షణ చింతనాన్ని సూచిస్తుంది. 

మయి సర్వాణి కర్మాణి సన్న్యస్యాధ్యాత్మ చేతసా
నిరాశీర్నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః |

బ్రహ్మార్పణం బ్రహ్మ హవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతం 
బ్రహ్మైవ  తేన గన్తవ్యం బ్రహ్మ కర్మ సమాధినా| 

చరణం 3:
భాగవత పురాణంలో కపిల మహర్షి, దత్తాత్రేయుల వారు ఇత్యాదులు భగవంతుడి అంశావతారాలు. తానే స్వయంగా ఈ విధంగా సుప్రసిద్ధులైన యోగులుగా అవతరించి భాగవతధర్మాన్ని వ్యాప్తి చేసాడు స్వామి. అంతకంటే ఘనమైన మహిమ కల పరిపూర్ణావతారమైన శ్రీవేంకటేశ్వరుడిగా శ్రీదేవితో కూడిన తన సంసారయోగాన్ని మనకు శరణ్యంగా  నిరంతరం శ్రీవేంకటాద్రిపై కృప చేయడం అభ్యాసంగా కల యోగి స్వామి! 

Audio link:
https://www.youtube.com/watch?v=fOhkPhqcBcg&feature=share

Monday, 19 August 2019

Influence of Azhwars' Tamil literature on annamayya

SrI annamAchArya wrote the songs in Lord's praise inspired by the divyaprabandham of Azhwars, the ancient Tamil poets who sang in His praise and preached a simple and practical philosophy that transcends all barriers like caste etc.
In Azhwars' philosophy, Lord nArAyaNa is the sole protector and the ultimate goal for every individual. His consort SrI stands for His kRpA or mercy. 

In many hymns of Azhwars, the Lord is the hero and the individual soul or jeeva is the heroine. Philosophically, the Lord is considered the only male and all  other beings are considered females.

Below is one song which was composed by annamayya under the influence of the Azhwars' verses or pASurams.

వుప్పతిల్లీ జవ్వనము వొళ్ళి మీఁదను
యెప్పుడు మఱవరాదు యేమి సేతునే ॥పల్లవి॥

vuppathillI javvanamu voLLi mIdhanu
yeppuDu maRavarAdu yEmi sEthunE ||pallavi||
As the youthfulness of my body and associated desires are at the peak, I am not able to forget Him anytime. What can I do?

చిలుకతో మాటాడితే చిమ్మి రేఁచీ వలపులు

కొలని లోపల నైతే నళుల బాద
పలు దిక్కులుఁ జూచితే పరగీ వెన్నెల వేఁడి
యెలమి నెందుఁ బోరాదు యేమి సేతునే ॥॥

charaNam 1:
chilukathO mAtADithE chimmi rEchI valapulu
kolani lOpalanaithE naLula bAdha
palu dikkulu jUchithE paragIi vennela vEDi
yelami nendu bOrAdhu yEmi sEthunE

As I speak to the parrot, my love for Him is multiplies manifold. As I enter the pond, I am perturbed by the bees. As I look around the sky in the night, I am tortured by the heat of the moonlight! Where else can I go and what else can I do?

సింగారపుఁ దోఁట నుంటే చిగురులు బెదరించీ
కంగి చింతించితే మదిఁ గంతుఁ డున్నాఁడు
కొంగున విసురుకొంటే గుప్పించీఁ జల్లగాలి
యింగితము దెలియదు యేమి సేతునే ॥॥


charaNam 2:
singArapu thOtanunTE chigurulu bedharinchI
kangi chinthinchithE madhi kanthuDunnADu
konguna visurukunTE guppinchI challagAli
yingitham teliyadhu yEmi sEthunE

As I enter the beautiful garden, the tender leaves scare me. As I try to think about my plight, there is manmatha in my mind who is disturbing me to unite with  Him. As I fan myself with the upper garment, the cool breeze disturbs me. I don't know what is right. What can I do?

కత లాలకించే నంటే కలసీఁ గోవిలఁ కూత
మితి నేకతాన నుంటే మించీఁ గోరిక
గతియై యింతలో శ్రీ వేంకటేశుఁ డు నన్ను నేలే
యితని వుప కారాన కేమి సేతునే ॥॥(12/209)


kathalAlakinchEnanTE kalasI kOvila kUtha
mithi nEkathAna nunTE minchI kOrika
gathiyai yinthalO SrIvEnkaTESudu nannu nElE
yithani vupakArAnakEmi sEthunE

As I plan to listen to the stories about Him, the sweet voice of the cuckoo disturbs me. If I leave myself alone, my desire for Him has no bounds. In the meantime, SrIvEnkaTESa, Who is my means, has come to me and ruled over me. What can I do for Him in return?

చిలుక, కోకిల భగవద్గుణ కీర్తనం పరమ భాగవతోత్తముని సూచిస్తుంది. ఈయనతో మాట్లాడిన జీవుడి భగవద్విరహం మరింత ఎక్కువైంది! తుమ్మెదలు పూలలో మకరందాన్ని మాత్రమే గ్రోలుతాయి. అదే విధంగా భాగవతోత్తములు కూడా భగవంతుడి పాదారవిందాలయందు మాత్రమే అనురక్తి కలిగి ఉంటారు. 

చివరలో అలమేలు మంగా సమేతుడైన వేంకటేశుడు (శ్రీవేంకటేశుడు) నాకు గతి గమ్యం తానే అయి నన్ను ఏలాడు అని మనలాంటి వారందరికీ విశ్వాసాన్ని కలుగజేయడం జరుగుతుంది. ఆయనకు ప్రత్యుపకారం ఏమీ చెయ్యలేము!

ఇది ఆళ్వారుల తమిళ పాశురాలు స్ఫూర్తిగా తీసుకుని అన్నమయ్య వ్రాసిన కీర్తన.

Sunday, 30 June 2019

A nice folk song by annamayya "rAvE kODala raTTaDi kODala"

Added English translation as planned before. Please see after the Telugu text.

॥పల్లవి॥ రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులునీతోఁజాలును

॥చ1॥ రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా

॥చ2॥ ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా

॥చ3॥ బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని-
నడ్డగించుకొంటివత్తయ్యా

వివరణ:

వ్యర్థమైన వ్యాపారాలన్నీ వదలి శ్రీనివాసుడిని ఆశ్రయించమని ఇద్దరు అత్తా కోడళ్ల మధ్య మొరటు సరస సంభాషణ రూపంలో ఈ కీర్తనలో అన్నమయ్య బోధిస్తున్నారు. ఇక్కడ అత్తా కోడళ్లు ఇద్దరు జీవులని సూచిస్తారు.

మాంచ యో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నట్లుగా (గీత 14వ అధ్యాయం 26 వ శ్లోకం) భగవంతుడిని అనన్య భక్తితో ఆశ్రయించి సేవించినవాడు అవ్యయమైన స్థితిని చేరుతాడు. ఇక్కడ భగవంతుడు అంటే శ్రీనివాసుడు, లక్ష్మీదేవిని తన వక్షస్స్థలంలో నిలుపుకొన్నవాడు, అంతే కానీ ఆవిడ లేని నారాయణుడు ఎప్పుడూ కాదు. అందుకే అన్నమయ్య "పుట్టు భోగులము మేము" కీర్తనలో తల్లి యాకే మగని దైవమని కొలిచేము (జగన్మాత భర్తని దైవంగా కొలిచాము) అంటారు. 

ఆచార్య అనుగ్రహంతో జగజ్జననీ జనకులని (శ్రీదేవితో కూడిన శ్రీవేంకటేశ్వరుణ్ణి) ఆశ్రయించడానికి ముందు ఇద్దరు జీవుల పరిస్థితిని ఈ కీర్తన సూచిస్తోంది.

పల్లవి:
మొదటి జీవుడు (అత్త): కోడలా రా! నీ గుట్టు రట్టు చేస్తాను!
రెండవ జీవుడు (కోడలు): పో పో అత్తా! నీతో నాకు ఇంక స్నేహం ఏమీ లేదు, నీ దోస్తు కటీఫ్!

చరణం 1:
మొదటి జీవుడు (అత్త): నువ్వు రాజుల మెప్పు పొందాలని వారి ఎదురుగుండా వారిపై బిగ్గరగా స్తోత్రాలు చేస్తూ జంకూ బెంకూ లేకుండా తిరిగావు.
రెండవ జీవుడు (కోడలు): ఓ చక్కనమ్మా! నువ్వు మాత్రం ఏమి తక్కువ తిన్నావు? దొడ్డవారు కానివారిని దొడ్డ వారు అనుకుని వారి మెప్పు కోసం అనేక మంది ఇళ్ళల్లో తిరిగావు.

ఎవరైనా స్తోత్రం చేస్తే పోతనలా సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యాలి. నిజమైన దొడ్డవారు పరమభాగవతోత్తములు, వారి ఇంట ఊడిగం చెయ్యాలి.

చరణం 2:
మొదటి జీవుడు (అత్త): అక్కడా ఇక్కడా నువ్వు అనేకమంది మగవాళ్ళతో సిగ్గు లేకుండా జట్టు కట్టావు. (అంటే భగవంతుణ్ణి కాకుండా పలువురు ఇతరులని ఆశ్రయించావు అని అర్థం.)
రెండవ జీవుడు (కోడలు): నేను ఏదో నా పాట్లు పడ్డాను. నువ్వు మాత్రం ప్రతి చోటా పదేసి మందిని మోహింపచేసుకున్నావు (మోసగించావు అని అర్థం).

భగవంతుడిపై అనన్య భక్తియే పాతివ్రత్యధర్మం అని అన్నమయ్య "అన్నిట నీవంతర్యామివి అవుట ధర్మమే అయినాను" అనే కీర్తనలో అంటారు.

చరణం 3:
మొదటి జీవుడు (అత్త): నా కడుపున (బొడ్డున) పుట్టిన పిల్ల వాడికి నిన్ను వ్యర్థంగా తీసుకుని వచ్చాను. (నీతో బాంధవ్యం లేదా సాంగత్యం వ్యర్థమని భావం. నిజమైన ఆత్మబంధువులు పరమ భాగవతోత్తములే.)
రెండవ జీవుడు (కోడలు): గుడ్డము పయినున్న కోనేటి రాయని అడ్డగించుకొంటినత్తయ్యా! (లేదా)
గుడ్డము పయినున్న కోనేటి రాయని అడ్డగించుకొంటివత్తయ్యా!

ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి.మొదటి అర్థంలో "నేను ఇకపైన ఎంతమాత్రం వ్యర్థురాలిని కాదు. కొండ పై నెలకొన్న కోనేటి రాయుడిని ఆశ్రయించాను" అని కోడలు చెపుతోంది. రెండవ అర్థంలో "ఓ అత్తా! నిన్ను ఒకటి వేద్దాం అనుకుంటే కోనేటి రాయుడిని అడ్డం పెట్టుకొన్నావు కాబట్టి బతికిపోయావు" అని అర్థం వస్తుంది!

ఇంతకీ ఎలాంటి స్వామిని ఆశ్రయించారు? శ్రీనివాసుణ్ణి. రాక్షసస్త్రీలను కూడా క్షమించి వదిలెయ్యమని హనుమన్నతో శ్రీరామాయణంలో చెప్పిన అమ్మ వక్షస్స్థలంలో ఉండగా ఆ స్వామి ఆశ్రయం ఇవ్వక ఒదులుతాడా? కాబట్టి ఆశ్రయించినవారు ఎవ్వరైనా క్షేమమే!

ఇక్కడ కోనేరు అంటే అందరికీ తెలిసిందే. స్వామి దేవితో కలసి విహరించే పుష్కరిణి కాబట్టి ఆ పుష్కరిణిని అత్యంత పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. స్వామి కోనేటి రాయడు అంటే తరింపచేసేవాడు.

Meaning and explanation in English:

In this song, Sri Annamacharya encourages us to give up all wasteful acts and resorting to things of lesser importance and take refuge in the Supreme Being Srinivasa. This song is in the form of a dialog between two ladies of a village one of whom is the daughter-in-law and the other is the mother-in-law. Each represent an ordinary human being who transformed into a devotee and the discussion is in the form of criticizing each other for the other's past deeds. Let us call the mother-in-law as Jiva 1 and daughter-in-law as Jiva 2.

Pallavi:

rAvE kODala raTTaDi kODala
pOvE pOvE attayyA! pondulu nItO chAlunu

Meaning:

Mother-in-law (Jiva 1): Oh my dear daughter-in-law, come here. I will expose all your secrets.
Daughter-in-law (Jiva 2): Go away, my mother-in-law, go away! No more friendship with you!

CharaNam 1:

rankelu vEyuchu rAjuleduTa nIvu
konku gosaru lEni kODala
pankajamukhi nIvu palu doDDa vArinDla
ankela dirigEvu attayyA!

Meaning and explanation:

Jiva 1: You have praised several kings assuming they are the protectors very loudly in front of them. 
Jiva 2: On the other hand, oh my beautiful mother-in-law! You have been to the places of numerous wealthy people thinking them to be wealthy to earn their good will. You were no less mischievous than me!

Here it is conveyed that the Lord alone is praiseworthy. A real devotee never aspires to be in the good books of the kings and the mighty. Similarly the real wealthy people are His devotees or bhAgavatOttamas. One has to be always subservient to them and serve them with keen interest.

CharaNam 2:

IDADa naluguru nEguru mogalatO
kUDi siggulEni kODalA!
vADaku paduguri valampinchukoni nIvu
ADAda tirigEvu attayyA!

Meaning and explanation:

Jiva 1: Oh shameless lady! You have united with 4-5 gentlemen here and there.
Jiva 2: Oh my mother-in-law! At every place, you have made some 10 people fall in love with you and have roamed here and there.

First statement metaphorically talks about taking refuge in deities and entities other than the Supreme Being.
Second statement talks about deceiving fellow beings.

CharaNam 3:

boDDuna buTTina pUpanikE ninnu 
goDDEru testinE kODalA!
guDDamu payinunna konETi rAyani
naDDaginchukonTinattayyA or aDDaginchukonTivattayyA!

Meaning and explanation:

Jiva 1: I have wastefully made you the wife of my son born from my womb (here it is written boDDu which means navel that represents the stomach).

Jiva 2: Oh my mother-in-law, I am no more useless, as I have taken refuge in the Lord the great temple pond called kOnEru or swAmi pushkariNI.

Conversely, when the Telugu text is "aDDaginchukonTivattayyA", this means - Oh my mother-in-law, you are saved from me, as you have taken refuge in the Lord.Otherwise I would have beaten you black and blue!

In Telugu kOnEru is also called tIrtham which means something that purifies. The Lord is called kOnETi rAyaDu because He is the One Who enters our mind and purifies us.








Saturday, 31 March 2012

Lord Rama as the remover of impediments

The Supreme Being out of His unconditional grace removes the impediments in our way to realize Him. This act of the Supreme Lord is called virOdhi nirasanam in Srivaishnavism. The killing of demons like rAvaNa etc. stands symbolic for this, as the Lord reincarnates as Rama, Krishna and so on.

Here is a beautiful song by annamAchArya that explains this concept.

Pallavi:
rAmA rAmabhadra ravivaMSa rAghava
yEmi yarudidi nIkintaTivAniki
Meaning:
Oh Lord Rama! Who descended in the dynasty of Ravi and Raghu, why is it so rare for You the Supreme Benevolent Lord to grace me?

nADu rAvaNu talalu narakinalAvarivi
nEDu nApApamulu khanDincharAdA
vADipratApamutODa vAridhigaTTina nATi-
vADaviTTe nAmanOvArdhigaTTarAdA
Meaning:
You have cut all the heads of Ravana that day, won't You destroy  the same way all my sins that stand as obstacles in reaching You? You have built a bridge across the sea that time with great valour, can't You quickly build one for my mind to be connected to You?

tanisi kuMbhakarNAdidaityula gelichitivi
kinisi nAyindriyAla geluvarAdA
yenasi haruni villu yekkupeTTi vanchi
ghanamu nAdurguNamu kaDuvancarAdA
Meaning:
You have won over demons like kumbhakarNa et al., is it not possible to win over all my demoniac senses? You have bent (broken for that matter) the huge bow of Siva, can't You subdue my solid vice?

sarusa vibhIShaNuDu SaraNanTE gAchitivi
garimanESaraNanTi gAvarAdA
torali SrIvEnkaTESa doDDugonchemenchanEla
yiravai lOkahitAnakEdainAnEmi
Meaning:
When Sri VibhIshana took refuge in You, You protected Him. Can't You protect with the same magnanimity me too who says You are my refuge? Oh Lord Sri Venkatesa! Why to differentiate between big and small, as long as it is in the world's interest?
Audio Link (click here)

Saturday, 20 August 2011

Lord is the Sole Doer

In this song, SrI annamAchArya explains how the supreme will of the Supreme Being alone prevails and the utmost dependence of the entire cosmos on Him.

Pallavi:
Evvaru karthalu kAru indhirA nAthudE kartha
nivvatillAthani vArai nEmamu thappakurO

Meaning:
Nobody is the doer, except the Master of SrI. Be His beings (consider yourselves to be) and never cross this rule (niyamam = nEmam in Telugu).

Charanam1:
karmamE karthayitE kadaku mOkshamE lEdhu, armili jIvudu kartayaitE puttugE lEdhu
marmapu mAya karthAyithE mari vignAnamE lEdhu, nirmithamu HaridhinthE nijamidherugarO

Meaning:

If our past karmas are the doer, there will never be deliverance at the end. If jIva is the doer, he will never choose to be born!
If mAyA or that will of the Lord which is incomprehensible by which we do not realize Him is the doer by itself, there will never be realization.
Learn the truth that all this is as set up by Lord Hari.

Charanam2:
prapanchamE kartayiythE pApa puNyamulu lEvu, upama manasu karthaiyuntE AchAramu lEdhu
kapatapu dhEhamulE karthalayithE chAvu lEdhu nepamu SriharidhinthE nErichi badhukarO

Meaning:If the material world comprising the five elements is the doer, there is no question of pApa and puNya (for it does not have any ego!). If the mind is the doer, there is nothing like following the right path (AchAram). If the deceptive bodies are the doers, there will never be death. Learn that all this is as willed by the Lord and live (meaningfully).

Charanam3:
palaSruthulu karthalai paragithE mEra lEdhu ala batta bayalu karthaithE nAdhAramu lEdhu
elaminindhariki kartha idhivO SrI vEnkatAdhri nilayapu Hari yinthE nEdE koluvarO

Meaning:If vEdhas with several statements are the doer, there is no boundary (that this is in accordance with them and this is against). If the open space is the doer, there will not be any support for anything. Knowing the Lord Hari Who has thiruvEngadam as His abode is the doer for all, pay your obeisance to Him today (now) itself.

Sunday, 14 August 2011

Lord is the only way to reach the Lord

In this song, the poet-musician Annamacharya teaches us that the Lord nArayaNa along with His consort SrI (lakshmI), stands as the sole means for us to be blessed to engage ourselves in a meaningful life serving Their devotees and singing Their glory.

Pallavi:**
mecchula dampathulAra mIrE gathi
mecchithi ninniTa mimmu merase mee chEthalu

Meaning:
Oh Couple of praiseworthy qualities! You are the only way. I praise you for
everything, as Your wonderful acts are brightly visible.

Charanam 1:
thammilOni maguvA! vO dharaNI dharudA!
mimmu nE nammithi nAku mIrE gathi
nemmadhinO indhirA! nIraja lOchanuDA!
kammi yE poddhunu mIre kalaru nA pAlanu

Meaning:**
Oh Lady seated in the lotus and the Lord Who held the earth! I
believe in You as the only recourse. Oh caring goddess indhirA and the
lotus-eyed Lord! Spanning over the time frame, You alone are there for me.
Note: 
Lotus stands for softness and thus the Goddess seated in the lotus stands for the Lord's compassion and concern for us which is a soft quality. Lord being lotus-eyed means He has eyes which are wide enough to see and bless us anywhere.
Lord uplifting the earth and holding on His tusks when He assumed the form of a wild boar stands symbolic for His efforts to uplift us.

Charanam 2:
pAla jaladhi kUthura! bhaktha vathsaluDa hari!
mElicchi rakshimcha nAku mIrE gathi
kElinO SrImahAlakshmi! kESava! dayAnidhi!
thAlimi mIrE nAku dhApu daNDa epudu

Oh daughter of the milky ocean! Oh Lord Hari who is affectionate toward His devotees! To protect me and give me good, You are the only means. Oh SrImahAlakshmi! Oh merciful Lord KESava! Protecting me is just a playful act for You. You are my strength and You are always my means of protection.

The Lord is called Bhaktha vathsala because of His quality called vAthsalyam which is similar to the affection a cow has for her calf. Similar to the cow licking the dirt on the calf's body, the Lord even enjoys the faults of jIva and uplifts him despite all his blemishes and offences committed.

Hari stands for the Lord Who gets us rid of our sins. Here sins stand for all impediments in our realizing Him.

The name KESava stands for the Lord from Whom brahmA (denoted by ka) and Siva (denoted by ISa) were born.

Because of His eternal association with Goddess lakshmI, the Lord is always full of mercy.
The Goddess is called SrI because the jIva resorts to Her for redemption (SrIyatE iti SrI:).

Charanam 3:chennagu ramAkAntha chendhina vO mAdhavuDA!
minnaka yE poddhu nAku mIrE gathi
chinni alamElu manga! SrI vEnkatESuDA!
yennike kekkinchi nannu yElukonTiridhigO

Meaning:Oh consort of the Divine Mother mA(hence mAdhava=Father of the universe), to Whom She, the personification of goodness belongs (here goodness stands for His grace or dayA),
not exceeding any time limit, You lead us to Yourselves. Oh Youthful Lady
seated on the lotus and the Lord Venkateswara! You have chosen even me
(nannunu), lifted me aloft and placed me and engaged me (Elukontiri) in the service (to fellow bhAgavatas).

Note:In this song, Sri Annamacharya explains the Vedic tenet "yam Evaisha vrNuthE thEna labhya:" the Supreme Being makes Himself available to whoever He chooses. The concern or SraddhA the Lord has for us stands symbolic for SrI (lakshmI) and the very Lordship of the Lord is due to that, as Vedas say "SraddhayA dhEvO dhEvathvam aSunthE". Hence the Lord nArAyaNa is always paid obeisance as SrImannArAyaNa or nArAyaNa associated with lakshmI.

Below is the song in Telugu font.

॥పల్లవి॥ మెచ్చుల దంపతులార మీరే గతి
మెచ్చితి నిన్నిట మిమ్ము మెరసె మీచేఁతలు
॥చ1॥ తమ్మిలోని మగువా వో ధరణీధరుఁడా
మిమ్ము నే నమ్మితి నాకు మీరే గతి
నెమ్మది నో యిందిరా నీరజలోచనుఁడా
కమ్మి యే పొద్దును మీరే కలరు నాపాలను
॥చ2॥ పాలజలధి కూఁతుర భక్త వత్సలుఁడ హరి
మేలిచ్చి రక్షించ నాకు మీరే గతి
కేలి నో శ్రీమహాలక్ష్మి కేశవదయానిధి
తాలిమి మీరే నాకు దాపు దండ యెపుడు
॥చ3॥ చెన్నగు రమాకాంత చెందిన వో మాధవ
మిన్నక యేపొద్దు నాకు మీరే గతి
చిన్ని యలమేలుమంగ శ్రీవేంకటేశుఁడా
యెన్నికె కెక్కించి నన్ను నేలుకొంటి రిదిగో

తెలుగు వ్యాఖ్య:

పల్లవి: 
ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా "నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా బహునా శ్రుతేన, యమేవైష వృణుతే తేన లభ్య:" - పరమాత్మ ప్రవచనాలను వినడం ద్వారా కానీ, మేధస్సు చేత కానీ, అనేక మంచి విషయాలు వినడం వల్ల కానీ లభ్యం కాడు. తాను ఎవరిని అనుగ్రహిస్తాడో వారికే లభ్యం అవుతాడు. 
అంటే భగవంతుడిని చేరడానికి మార్గం కూడా భగవంతుడే. 
జగన్మాత లక్ష్మీదేవి ఆ నారాయణుడి కృపా స్వరూపిణి.
బహుదుస్తారమైన ఈ సంసారం నుండి ఉద్ధరింపబడటానికి ఆదిమిథునమైన ఆ లక్ష్మీ నారాయణులే గతి అని అన్నమయ్య వారిని వేడుకొంటున్నారు.    

మొదటి చరణం:
ఇక్కడ అమ్మవారు పుష్పవాసిని (తమ్మిలోని మగువ) అని చెప్పడం మృదుత్వాన్ని సూచిస్తుంది. ఈ మార్దవం స్వామి దయార్ద్ర హృదయాన్ని సూచిస్తుంది. అక్కడే దయా రూపిణి అయిన లోకమాత కొలువు దీరి ఉంటుంది. 
భగవంతుడు వరాహావతారం ఎత్తి భూమిని ఉద్ధరించడం ఆయన మన రక్షణ కోసం సర్వ ప్రయత్నాలూ చేస్తాడని సూచిస్తుంది. భగవంతుడి పుండరీకాక్షత్వం (నీరజ లోచనుడా!) ఆయన విశాలమైన నేత్రాలతో మనల్ని గమనిస్తూ రక్షిస్తూంటాడని తెలియచెపుతుంది.  
రెండవ చరణం: 
భగవంతుడితో నిత్యం ఉండే జగన్మాత ఆయన క్షీరసముద్రంలో కొలువుదీరినప్పుడు తాను కూడా పాలసముద్రపు పట్టిగా అవతరించింది. సర్వాంతర్యామి అయిన ఆయన కూడా ఆ పాలసముద్రంలోనే ఇల్లరికం ఉండిపోయాడు! ఇక్కడ తెల్లటి క్షీరసముద్రం స్వచ్చతనీ, దోష రాహిత్యాన్నీ సూచిస్తుంది. 
భగవంతుడి వాత్సల్యం గోవుకి తన దూడపై ఉండే లాంటిది. గోవు తన దూడ శరీరంపైనున్న మలినాన్ని ఎంత ప్రీతిగా నాకుతుందో, భగవంతుడు కూడా తన భక్తుల దోషాలని అంతే భోగ్యంగా స్వీకరిస్తాడని పెద్దలు అంటారు. దీనినే స్వామి "అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్య భాక్, సాధురేవ స మంతవ్య:" అని భగవద్గీతలో చెప్పారు. (గీత 9వ అధ్యాయం 30వ శ్లోకం). అనన్య భక్తితో తనని కొలిచిన భక్తుడు ఎంత దురాచార పరాయణుడైనా సాధుపురుషుడిగానే పరిగణించాలి. 
హరిర్హరతు పాపాని అన్నట్లుగా హరి అంటే పాపాలని పోగొట్టే వాడు. ఇక్కడ పాపాలు అంటే అవి భగవత్ ప్రాప్తి ప్రతిబంధకాలు ఏవైనా.
మనలని రక్షించడం ఆ శ్రీమహాలక్ష్మికీ, కేశవుడికీ, ఒక ఆట వంటిది (కేళి). కేశవుడు అంటే బ్రహ్మకీ, శివుడికీ మూలమైన వాడు (హరివంశం). అంటే సృష్టి స్థితి లయకారకుడు స్వామి. అమ్మవారితో నిత్యం కలసి ఉండే సర్వేశ్వరుడు సహజంగానే దయానిధి! ఆ దివ్యదంపతులే అందరికీ బలం మరియు రక్షణ.
మూడవ చరణం:
మాధవుడు అంటే అమ్మవారికి (మా) భర్త, జగత్పిత. అలమేలు మంగ అనే పదానికి తమిళ మూలం అలర్మేల్ మంగై అంటే తామర పుష్పం పై కూర్చొన్న స్త్రీ - లక్ష్మీ దేవి. అసలు ఈ కీర్తన "అగలగిల్లేన్ ఇఱైయుం  ఎన్ఱు అలర్మేల్ మంగై ఉఱై మార్బా" అనే నమ్మాళ్వారుల తమిళ పాశురానికి అన్నమాచార్యుల తెలుగు వ్యాఖ్యానం.  
"ఎన్నికకెక్కించి నన్నును ఏలుకొంటిరిదిగో" అన్నప్పుడు పైన చెప్పిన ఉపనిషద్వాక్యం (యమేవైష వృణుతే తేన లభ్య:) వర్తిస్తుంది ఎందుకంటే పరమాత్మ శ్రీమన్నారాయణుడు (లక్ష్మీ నారాయణులు) నన్ను "ఎన్నుకొని" ఏలుకొన్నాడు (ఏలుకొన్నారు) అని చెప్పడం వల్ల. నన్నును (నన్ను కూడా)  అంటే అనేక అపచారాలు చేసి అధమాధమ స్థితిలో ఉన్న జీవుడిని కూడా ఆయన ఉద్ధరించాడనీ ఆశ్చర్యపోవడం. 

Click here for an audio link to this song.
Courtesy: Smt. Jayanthi Sridharan
Ragam: Kalyana Vasantham
Tune set and sung by: Smt. Jayanthi Sridharan

Annamayya on adherence to rituals vs engaging in service

In this song, SrI annamachArya is talking about the superiority of engaging ourselves in praising the Lord's glory and serving His devotees over performance of rituals, symbolizing them by the sandhyA vandanam - a prayer offered three times a day at dawn, dusk and mid-day.

Pallavi:
sahaja vaiShNava AchAra varthanula sahavAsame mA sandhya ||
Living in the company of the Vaishnavas who live a life consistent with their nature of Seshatvam (subservience to the Lord), is our sandhyAvandanam.

charanam 1:
athiSayamagu SrI hari sankIrthana sathathaMbunu mA sandhya |
mati rAmAnuja mathamE mAkunu | cathuratha merasina sandhya ||
Excelling in singing the glory of Srihari always, is our sandhyA.
Accepting the religion of rAmAnuja, is our bright and wise sandhyA.

charaNam 2:
 parama BhAgavata pAdha sEvanayE | saravi nenna mA sandhya |
sirivaru mahimalu cheluvondhaga vEsAraka vinutE mA sandhya ||
Servitude to the feet of paramabhAgavathas (those who have excelled in the above), is our sandhyA.
Untiring listening to the glory of the lover of Sri with pleasure, is our sandhyA.

charaNam 3:
mantukekka thirumanthra paThanamE | santhathamunu mA sandhya |
kanthugurudu vEnkaTagirirAyani santharpaNamE mA sandhya ||
Studying thirumanthra always, is our sandhyA.
Existing for the complete satisfaction (samyak tharpaNam) of the Lord of Venkatagiri (Lord Venkateswara), Who is far superior to kanthu (manmatha - the Hindu deity of love) in attraction, is our sanhdyA.

Note:
1. Thirumanthra means the ashtAksharI manthra "Om namO nArAyaNAya" one of the important tenets of Srivaishnavism, the school of thought of which Sri annamacharya was an adherent. Here, annamayya wisely puts it as "paThanam" or study, rather than "japam" or reptetitive recitation of the words enshrined in the mantra, in line with his non-ritualistic views presented in this song. For an understanding and appreciation of the meaning of this mantra, please visit:
http://yatirajadasa.tpv.9f.com/ashtasloki.html

2. Annamayya was inspired by the following Poigai AzhwAr's pASuram (Tamil verse) from Mudhal Thiruvandhadhi (verse 33):

naharam aruL purindhu nAnmuharkku-p-pUmEl
pahara maRai payandha paNban peyarinaiyE
pundhiyAl SindhiyAdhu, Odhi uruvennum
andhiyAl Am payanAvadhu en?

It is the Lord Who blessed BrahmA with a place in the lotus stemming out from His navel. He is the One Who gave knowledge to BrahmA in the form of Vedas. Instead of thinking of His auspicious qualities, what benefit one derives from counting the chants of mantras in sandhyAvandanam?

Free translation of the above in poetic form is as below:

The Lord Who graces
Brahma a place
In a lovely lotus
And teaches him Vedas,
Instead of having the heart
Fixed on His thoughts
What benefit one gets
From counting the chants
Daily thrice?