తాళ్లపాక చినతిరుమలాచార్య
రేకు: 12-5 సంపుటము: 10-70
పల్లవి:
సవతులమైనాను సంగతి దప్పదగునా
రవళి వావిలిపాటి రామచంద్రు ముందర ॥పల్లవి॥
వివరణ:
ఇద్దరు భాగవతుల మధ్య సంభాషణ ఇది. జీవులందరు భగవంతుడికి భార్యలే. ఒక్కొక్క సారి బిడ్డలే. ఈ కీర్తనలో భార్యలుగా తీసుకొంటేనే నప్పుతుంది.
భగవదనుగ్రహం కలిగిన ఒక జీవుడు మరొక జీవుడితో ఇలా అంటున్నాడు.
మనం ఇద్దరమూ స్వామికి భార్యలమే. స్వామి భక్తులైన మనం సవతులం కదా అని అయన ఎదురుగా సంగతి, స్వరం తప్పవచ్చునా? అంటే పరస్పరం స్నేహభావంతో మెలగాలి అని అర్థం. సహ నౌ భునక్తు అన్నట్టు కలిసి భగవదనుభవం పొందాలి.
1వ చరణం:
01.నీవనగా నే ననగా నిష్టూరా లేటికే
చేవదేరే మాట లెల్ల చిగిరించీని
మోవరాని దూరు లెల్ల మోపులు గట్టగాను
వేవేగ నిన్నియు మనవిభుడు మోచీనా ॥సవతుల॥
వివరణ:
శ్రీరామాయణంలో స్వామి "సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ" అంటాడు. అంటే "నన్ను శరణు వేడిన సమస్త జీవులకి అభయాన్ని ఇస్తాను, ఇదే నా వ్రతం" అని చెపుతాడు.
నిన్ను రక్షిస్తాడు అంటే నిన్ను రక్షిస్తాడు అంటూ అని నిష్ఠురాలు పోవడం దేనికి? "అభయం సర్వభూతేభ్యో" అని అయన శ్రీరామాయణంలో అన్న మాట నాకు గుర్తుకు వస్తోంది. ఆయన ఏలుకోడు అని నిందించడం ఎందుకు? దీని అంతటితో వేగిపోతే ఆయన మనల్ని మోస్తాడా?
ఇక్కడ రెండు విషయాలు చూడాలి. స్వామిపై నాయికకు ఉన్న ప్రేమాతిశయం మొదటిది. ఆయన సున్నితమైన మనస్సు ఎంత నొచ్చుకుంటుందో మనం వేసే నిందలు ఆయనకి ఎంత భారం అవుతాయో అని నాయిక భయం. రెండవది ఆయన తప్పక మోస్తాడు అన్న మహా విశ్వాసం. ఈ రెండవ భావం మన భారం అంతా స్వామిదే అనే నిబ్బరాన్ని ఇస్తుంది.
2వ చరణం:
02.కాదనగా నౌననగా కరకరేమిటికే
మీద మీద జగడాలు మితిమీరీని
వాదుల యీ సుద్దు లెల్ల వాములు వెట్టెగాను
కాదని మనవిభుడు గాదెల బోసీనా ॥సవతుల॥
వివరణ:
నీకు మాపై ప్రేమ ఉందనీ, కాదు, లేదనీ ఆయనపై మన ఈ కరకర కొరకరలు దేనికి ? రోజు రోజుకి మనకి ఆయనతో గొడవలు మరీ ఎక్కువై పోతున్నాయి. ఈ వాదులాటలు అన్నీ మోపులకొద్దీ అయితే కాదని మన స్వామి వాటిని ఏమైనా గాదెలో పడేసి ఉంచుతాడా? కాదు, తప్పక మనల్ని అక్కున చేర్చుకుని ఆదరిస్తాడు అని భావం.
3వ చరణం:

03.రమ్మనగ పొమ్మనగ రారాపు లేటికే
దొమ్మి రేగి కాకలు తోదోపు లాడీని
నమ్మించి శ్రీవెంకటనాథుడు నిన్ను నన్నును
సమ్మతిగాగూడగాను సతము లై తిమిగా. ॥సవతుల॥
వివరణ:
స్వామితో రమ్మనీ పొమ్మనీ ఈ కఠినమైన ఘర్షణలు దేనికి? విరహ తాపంతో మనం ఇద్దరం స్వామిని కలవడానికి ఒకరు అంటే ఒకరు అని ఉన్నాం. ఎలాగో నమ్మించి ఆయన మనల్ని తన సమ్మతితో కూడడంతో మనకి ఒక అర్థవంతమైన అస్తిత్వం (సత్త) వచ్చింది కదా!

No comments:
Post a Comment
Comments are welcome.