Sunday 30 June 2019

A nice folk song by annamayya "rAvE kODala raTTaDi kODala"

Added English translation as planned before. Please see after the Telugu text.

॥పల్లవి॥ రావే కోడల రట్టడి కోడల
పోవే పోవే అత్తయ్యా, పొందులునీతోఁజాలును

॥చ1॥ రంకెలు వేయుచు రాజులెదుట నీవు
కొంకు గొసరు లేని కోడల
పంకజముఖి నీవు పలుదొడ్డవారిండ్ల
అంకెలఁ దిరిగేవు అత్తయ్యా

॥చ2॥ ఈడాడ నలుగురు నేగురు మొగలతో
కూడి సిగ్గులేని కోడల
వాడకుఁ బదుగురి వలపించుకొని నీవు
ఆడాడఁ దిరిగేవు అత్తయ్యా

॥చ3॥ బొడ్డునఁ బుట్టిన పూఁపనికే నిన్ను
గొడ్డేరు తెస్తినే కోడల
గుడ్డముపయినున్న కోనేటిరాయని-
నడ్డగించుకొంటివత్తయ్యా

వివరణ:

వ్యర్థమైన వ్యాపారాలన్నీ వదలి శ్రీనివాసుడిని ఆశ్రయించమని ఇద్దరు అత్తా కోడళ్ల మధ్య మొరటు సరస సంభాషణ రూపంలో ఈ కీర్తనలో అన్నమయ్య బోధిస్తున్నారు. ఇక్కడ అత్తా కోడళ్లు ఇద్దరు జీవులని సూచిస్తారు.

మాంచ యో అవ్యభిచారేణ భక్తియోగేన సేవతే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అన్నట్లుగా (గీత 14వ అధ్యాయం 26 వ శ్లోకం) భగవంతుడిని అనన్య భక్తితో ఆశ్రయించి సేవించినవాడు అవ్యయమైన స్థితిని చేరుతాడు. ఇక్కడ భగవంతుడు అంటే శ్రీనివాసుడు, లక్ష్మీదేవిని తన వక్షస్స్థలంలో నిలుపుకొన్నవాడు, అంతే కానీ ఆవిడ లేని నారాయణుడు ఎప్పుడూ కాదు. అందుకే అన్నమయ్య "పుట్టు భోగులము మేము" కీర్తనలో తల్లి యాకే మగని దైవమని కొలిచేము (జగన్మాత భర్తని దైవంగా కొలిచాము) అంటారు. 

ఆచార్య అనుగ్రహంతో జగజ్జననీ జనకులని (శ్రీదేవితో కూడిన శ్రీవేంకటేశ్వరుణ్ణి) ఆశ్రయించడానికి ముందు ఇద్దరు జీవుల పరిస్థితిని ఈ కీర్తన సూచిస్తోంది.

పల్లవి:
మొదటి జీవుడు (అత్త): కోడలా రా! నీ గుట్టు రట్టు చేస్తాను!
రెండవ జీవుడు (కోడలు): పో పో అత్తా! నీతో నాకు ఇంక స్నేహం ఏమీ లేదు, నీ దోస్తు కటీఫ్!

చరణం 1:
మొదటి జీవుడు (అత్త): నువ్వు రాజుల మెప్పు పొందాలని వారి ఎదురుగుండా వారిపై బిగ్గరగా స్తోత్రాలు చేస్తూ జంకూ బెంకూ లేకుండా తిరిగావు.
రెండవ జీవుడు (కోడలు): ఓ చక్కనమ్మా! నువ్వు మాత్రం ఏమి తక్కువ తిన్నావు? దొడ్డవారు కానివారిని దొడ్డ వారు అనుకుని వారి మెప్పు కోసం అనేక మంది ఇళ్ళల్లో తిరిగావు.

ఎవరైనా స్తోత్రం చేస్తే పోతనలా సర్వేశ్వరుణ్ణి స్తోత్రం చెయ్యాలి. నిజమైన దొడ్డవారు పరమభాగవతోత్తములు, వారి ఇంట ఊడిగం చెయ్యాలి.

చరణం 2:
మొదటి జీవుడు (అత్త): అక్కడా ఇక్కడా నువ్వు అనేకమంది మగవాళ్ళతో సిగ్గు లేకుండా జట్టు కట్టావు. (అంటే భగవంతుణ్ణి కాకుండా పలువురు ఇతరులని ఆశ్రయించావు అని అర్థం.)
రెండవ జీవుడు (కోడలు): నేను ఏదో నా పాట్లు పడ్డాను. నువ్వు మాత్రం ప్రతి చోటా పదేసి మందిని మోహింపచేసుకున్నావు (మోసగించావు అని అర్థం).

భగవంతుడిపై అనన్య భక్తియే పాతివ్రత్యధర్మం అని అన్నమయ్య "అన్నిట నీవంతర్యామివి అవుట ధర్మమే అయినాను" అనే కీర్తనలో అంటారు.

చరణం 3:
మొదటి జీవుడు (అత్త): నా కడుపున (బొడ్డున) పుట్టిన పిల్ల వాడికి నిన్ను వ్యర్థంగా తీసుకుని వచ్చాను. (నీతో బాంధవ్యం లేదా సాంగత్యం వ్యర్థమని భావం. నిజమైన ఆత్మబంధువులు పరమ భాగవతోత్తములే.)
రెండవ జీవుడు (కోడలు): గుడ్డము పయినున్న కోనేటి రాయని అడ్డగించుకొంటినత్తయ్యా! (లేదా)
గుడ్డము పయినున్న కోనేటి రాయని అడ్డగించుకొంటివత్తయ్యా!

ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి.మొదటి అర్థంలో "నేను ఇకపైన ఎంతమాత్రం వ్యర్థురాలిని కాదు. కొండ పై నెలకొన్న కోనేటి రాయుడిని ఆశ్రయించాను" అని కోడలు చెపుతోంది. రెండవ అర్థంలో "ఓ అత్తా! నిన్ను ఒకటి వేద్దాం అనుకుంటే కోనేటి రాయుడిని అడ్డం పెట్టుకొన్నావు కాబట్టి బతికిపోయావు" అని అర్థం వస్తుంది!

ఇంతకీ ఎలాంటి స్వామిని ఆశ్రయించారు? శ్రీనివాసుణ్ణి. రాక్షసస్త్రీలను కూడా క్షమించి వదిలెయ్యమని హనుమన్నతో శ్రీరామాయణంలో చెప్పిన అమ్మ వక్షస్స్థలంలో ఉండగా ఆ స్వామి ఆశ్రయం ఇవ్వక ఒదులుతాడా? కాబట్టి ఆశ్రయించినవారు ఎవ్వరైనా క్షేమమే!

ఇక్కడ కోనేరు అంటే అందరికీ తెలిసిందే. స్వామి దేవితో కలసి విహరించే పుష్కరిణి కాబట్టి ఆ పుష్కరిణిని అత్యంత పవిత్రమైన తీర్థంగా భావిస్తారు. తీర్థం అంటే తరింపచేసేది అని అర్థం. స్వామి కోనేటి రాయడు అంటే తరింపచేసేవాడు.

Meaning and explanation in English:

In this song, Sri Annamacharya encourages us to give up all wasteful acts and resorting to things of lesser importance and take refuge in the Supreme Being Srinivasa. This song is in the form of a dialog between two ladies of a village one of whom is the daughter-in-law and the other is the mother-in-law. Each represent an ordinary human being who transformed into a devotee and the discussion is in the form of criticizing each other for the other's past deeds. Let us call the mother-in-law as Jiva 1 and daughter-in-law as Jiva 2.

Pallavi:

rAvE kODala raTTaDi kODala
pOvE pOvE attayyA! pondulu nItO chAlunu

Meaning:

Mother-in-law (Jiva 1): Oh my dear daughter-in-law, come here. I will expose all your secrets.
Daughter-in-law (Jiva 2): Go away, my mother-in-law, go away! No more friendship with you!

CharaNam 1:

rankelu vEyuchu rAjuleduTa nIvu
konku gosaru lEni kODala
pankajamukhi nIvu palu doDDa vArinDla
ankela dirigEvu attayyA!

Meaning and explanation:

Jiva 1: You have praised several kings assuming they are the protectors very loudly in front of them. 
Jiva 2: On the other hand, oh my beautiful mother-in-law! You have been to the places of numerous wealthy people thinking them to be wealthy to earn their good will. You were no less mischievous than me!

Here it is conveyed that the Lord alone is praiseworthy. A real devotee never aspires to be in the good books of the kings and the mighty. Similarly the real wealthy people are His devotees or bhAgavatOttamas. One has to be always subservient to them and serve them with keen interest.

CharaNam 2:

IDADa naluguru nEguru mogalatO
kUDi siggulEni kODalA!
vADaku paduguri valampinchukoni nIvu
ADAda tirigEvu attayyA!

Meaning and explanation:

Jiva 1: Oh shameless lady! You have united with 4-5 gentlemen here and there.
Jiva 2: Oh my mother-in-law! At every place, you have made some 10 people fall in love with you and have roamed here and there.

First statement metaphorically talks about taking refuge in deities and entities other than the Supreme Being.
Second statement talks about deceiving fellow beings.

CharaNam 3:

boDDuna buTTina pUpanikE ninnu 
goDDEru testinE kODalA!
guDDamu payinunna konETi rAyani
naDDaginchukonTinattayyA or aDDaginchukonTivattayyA!

Meaning and explanation:

Jiva 1: I have wastefully made you the wife of my son born from my womb (here it is written boDDu which means navel that represents the stomach).

Jiva 2: Oh my mother-in-law, I am no more useless, as I have taken refuge in the Lord the great temple pond called kOnEru or swAmi pushkariNI.

Conversely, when the Telugu text is "aDDaginchukonTivattayyA", this means - Oh my mother-in-law, you are saved from me, as you have taken refuge in the Lord.Otherwise I would have beaten you black and blue!

In Telugu kOnEru is also called tIrtham which means something that purifies. The Lord is called kOnETi rAyaDu because He is the One Who enters our mind and purifies us.








4 comments:

  1. Translation with true purport and meaning as per the sampradayam. Excellent one. truly representing the real spirit of Annamayya keerthanas. To do justice to Annamacharya keerthanas, the tradition,sampradayam and philosophy Annamacharya followed has to be really understood. Otherwise the existing translations of many of the old and new scholars without an iota of basic knowledge of the Visistadvaita philosophy and theology doesn't out bring the true meaning of Annamacharya keerthanas. Unfortunately, many of the translations are being rendered by so called scholars who have no idea about Visistadvaita philosophy and sampradayam leading to all kinds of misinterpretations of Annamacharya keerthanas.

    ReplyDelete
  2. Thanks Murali. Appreciated your observations. Mine is a humble attempt to bring out the philosophically true meanings, purpose and intent of Sri Annamacharya's songs, even though with my limited knowledge of ancient Telugu.

    ReplyDelete
  3. so wonderful. you gave me immense happiness by giving out the meaning of this song.
    Thank you!

    ReplyDelete
    Replies
    1. Thanks Rohini garu. I wrote this to provide the correct interpretation as I have seen misinterpretations of the song.

      Delete

Comments are welcome.