Thursday 14 November 2019

The Mother Who suits the Supreme Lord

Chakkani Talliki chAngu bhaLA - explanation in Telugu and English with commentary

పల్లవి:

చక్కని తల్లికి చాంగుభళా తన
చక్కెర మోవికి చాంగుభళా


Pallavi:

chakkani talliki chAngu bhaLA tana
chakkera mOviki chAngu bhaLA


వివరణ:
శ్రీమన్నారాయణుడు మనలని లక్షించి రక్షించే తత్త్వమే లక్ష్మీదేవి. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి "రాఘవోర్హతి వైదేహీం" అన్నట్లుగా కల్యాణ గుణాభిరాముడైన ఆ భగవంతుడికి అన్నివిధాలా అనురూప అయిన ఆ చక్కని తల్లికి మేలు, జయం, మంగళం అంటున్నారు అన్నమయ్య. ఇక్కడ మేలు అంటే విముఖులైన మనలని తమపట్ల అభిముఖులుగా చేసుకోవడమే ఆ లక్ష్మీనారాయణులు తమకు తాము చేసుకొనే మేలు. 

"పలుకు తేనెల తల్లి పవళించెను" అని అన్నమయ్య అన్నట్లుగా మనకి హితమైన మధురవాక్కులను ఉపదేశించే ఆ తల్లి వదనానికి మంగళం.  

Explanation:


As the root laksh in Sanskrit stands for looking at or aiming at, the Divine Mother is called Lakshmi and She stands for the aspect of Lord's targeting us and uplifting. As sage Valmiki says in Sri Ramayana  "rAghavOrhati vaidEhIm" that sItA suits well Lord Rama, She befits Lord SrimannArAyaNa in all Her qualities. Annamayya sings all glories to such beautiful Mother and says may good happen to Her. Here good means, blessing us and turning towards Themselves i.e. The Divine Couple.


As Sri Annamcharya says in another song "paluku tEnela talli pavLinchenu", - The Mother is of nectarine words as all Sastras are from SrImannArAyaNa and SrI and Narayana are not separate. Annamayya sings all glories to Her such bright face of sweet words.


చరణం 1:
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా

CharaNam 1:

kulikeDi muripepu kummarimpu tana
saLupu jUpulaku chAngu bhaLA
palukula sompula patitO kasareDi
chalamula alukaku chAngubhaLA

వివరణ:
శ్రీహరి చేసే సృష్టి స్థితి లయాలకు తన క్రీగంటి చూపుతో అనుజ్ఞ ఇస్తూ ఆయన చేసే ఆశ్చర్యకరమైన కార్యకలాపాలకు మురిసిపోతూ ఉండే ఆమె దృక్కులకు మంగళం. 
ఆశ్రితులని  రక్షించమని సర్వేశ్వరుడితో అందంగా వాదులాడి అలిగే ఆమె క్షణికమైన అలుకకు మంగళం. 


Explanation:

She looks at Lord Sri Hari providing Her consent to the creation, protection and destruction that He takes up. She looks at His wonderful deeds with great adoration and astonishment. All glories to Her such looks.

She pleads with the Lord to protect us and acts as if She is angry with Him in the process. All glories to Her momentary anger!

చరణం 2:

కిన్నెరతో పతికెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా

CharaNam 2:

kinneratO patikelana niluchu tana
channu meRugulaku chAngubhaLA
unnati patipai noragi niluchu tana
sannapu nadimiki chAngu bhaLA




వివరణ:
"వరవీణామృదుపాణి" అని సంగీతకారులు దర్శించినట్లుగా కిన్నెర వాయిస్తూ తన పతికి ఎదురు నిలిచిన జగన్మాత మంగళసూత్రమైన శ్రీవారి వైభవాలకు మంగళం.  ఇక్కడ అన్నమాచార్యులవారి పూర్వాచార్యులైన పరాశర భట్టార్యుల  "శ్రీ స్తనాభరణం తేజః శ్రీరంగేశయమాశ్రయే"  అన్న శ్రీసూక్తి స్మరణీయం. 

బ్రహ్మోత్సవాల్లో శ్రీవారిని వీణాధారిణి  అయిన లక్ష్మీదేవిగా అలంకరించడం మనకు విదితమే కదా!

శ్రీమన్నారాయణుడిని మాత్రమే ఆధారంగా కలిగి తనకు వేరే అస్తిత్వం లేదు అని సూచించే విధంగా ఆయనపై ఒరిగి నిలుచున్న ఆమె తత్త్వానికి మంగళం. 

Explanation:

She plays "Kinnera" a musical instrument and faces Her Lord. The Lord shines on Her chest as Her mangaLa sUtra. All glories to the magnificence of the Lord Who thus shines. Here it is worth noting that musicians visualize the Divine Mother as "Vara Veena MRdu pANi" or the one playing a great Veena. The Lord of seven hills is decorated as Goddess Lakshmi playing Veena during brahmOtsavams. Also it is worth noting Sri Parasara Bhattar's Sri Sookti "SrI stanAbharaNam tEja: SrI rangESayam ASrayE" - we take refuge in Lord Ranganatha Who shines as the chest ornament or Mangala Sutra of the Mother of the Universe Sridevi.

Indicating that Lakshmi and Narayana are not separate and She does not have a separate identity on Her own, She stands taking support from Him on Her waist. All glories to such Divine Mother!

చరణం 3:

జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా
విందయి వెంకట విభుబెనచిన తన
సంది దండలకు చాంగుభళా

CharaNam 3:

Jandepu muthyapu sarula hAramula
chandana gandhiki chAngu bhaLA
vindayi venkaTa vibhu benachina tana
sandi danDalaku chAngu bhaLA


వివరణ:
ముత్యాన్ని సంస్కృతంలో ముక్తం అంటారు. తాను చెప్పిన వారికి ముక్తిని ఇచ్చే ముకుందుని పత్ని ముత్యాల హారాల్ని  ధరించడం ఉచితమే కదా! భగవంతుడిని ఆహ్లాదపరిచే చందనం వంటి అత్యంత భోగ్యమైన ఆ దేవికి మంగళం. చందన పరిమళం ఆవరించినట్లుగా భోగ్యంగా ఆయనని కట్టివేసే  ఆ కల్పవల్లి బాహువులకు మంగళం. అమ్మవారి ఈ లక్షణాన్ని సంశ్లేషైక భోగ్యత్వం అంటారు. భగవంతుడు తన కృపచే కట్టివేయబడతాడు అన్నది విశేషార్థం. 


Explanation:

All glories to the Divine Mother, Who is for the exclusive enjoyment of the Lord like a sandal paste, wearing necklaces of pearls. Pearl is called "muktam" in Sanskrit which also means something liberated. For the Divine Mother, Who mediates on behalf of the living beings or jIvas for their liberation as His kRpA or compassion personified, it is looks very apt to wear a necklace of muktams! Here it is to be further noted that the Lord is called Mukunda or The One Who grants liberation.


Like the fragrance from the sandal pervades, She embraces the Lord as His object of enjoyment and all glories to Her hands that tightly hold the Lord! This metaphorically means that the Lord is bound by His own kRpA or compassion.

Audio by Smt Sravani Ganti

No comments:

Post a Comment

Comments are welcome.